="june" style="display : none;"> -->
అన్నమ్మ టీచర్

Pages

  • Home
  • Contact

Wednesday, 12 December 2012

Smt. ANNAMMA garu WELCOME TO INDIA


Posted by Unknown at 04:41 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Monday, 10 December 2012

Sri Kasa Venkata Srinivas Essay On Smt. Anamma Teacher Charity


Posted by Unknown at 09:57 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Monday, 20 August 2012

అన్నమ్మ టీచర్: About Smt.S.Annamma Teacher







అ) తల్లిదండ్రులు, జననం,బాల్యం:
అన్నమ్మ గారు ఆరోగ్యమ్మ,శ్రీ జోసెఫ్ పుణ్య దంపతులకు 17 జులై 1947 లో నెల్లూరు జేమ్స్ గార్డెన్స్ లో జన్మించారు, తాత కోట్లపుడి దేవదాసు.ఆయుర్వేడ్ డాక్టర్. పల్లెటూళ్ళకు తిరిగి వైద్యసహాయం అందిస్తూ ఉండేవారు. వైద్యం చెయ్యడానికి వెళ్ళే తాతగారి సైకిల్ పై అన్నమ్మగారు చిన్నప్పుడు ఎక్కి ఊరూరు తిరుగుతూ పల్లెల పరిస్థితులను గమనించింది. 12 మాసాల బిడ్డగా తాత చెంతకు చేరిన అన్నమ్మ 12 సంవత్సరాలపాటు తాతగారి ఆలనా పాలనలోనే పెరిగి 12 సంవత్సరాల తర్వాత తల్లి చెంతకు చేరుకుంది అన్నమ్మ.విచిత్రమేమిటంటే అన్నమ్మగారి సర్టిఫికేట్ లో తండ్రి పేరు దగ్గర తాతగారి పేరు ఉంటుంది. తాతతో అన్నమ్మకి అంత అనుబంధం. తాతా-మనుమరాలి అనుబంధం,ఆప్యాయత అంత విడదీయలేనిది. తాతాగారి వద్దేకాదు మామయ్యల గారాబాల బిడ్డగాకూడా పెరిగింది. అన్నమ్మ గారికి చెల్లెలు "వెరోనిక"ఒక చెల్లెలు. ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. చంద్రశేఖర్ ,సురేంద్రబాబు అన్నమ్మ సోదరులు. వీరు వ్యాపారరంగంలో ఉన్నారు.

ఇ) విద్యాభ్యాసం:
ఆ రోజుల్లో ఎస్.ఎస్.ఎల్.సి. లేదా టెన్త్ క్లాసు లాంటివి లేవు.ఇటువంటి విద్యార్హతకు సమాన స్థాయిలో హెచ్.ఎస్.సి. ఉండేది.నెల్లూరు లోని సెయింట్  జోసెఫ్ గర్ల్స్  హైస్కూల్ లో అన్నమ్మ  హెచ్.ఎస్.సి., డి.కే.ఉమెన్స్ కాలేజీ లోబి.ఎ., విజయనగరం మహారాజ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ లో బి.ఇడి., ఎం.ఎ.ఆంధ్రా యూనివర్సిటీ లో చేశారు. నిజానికి   హెచ్.ఎస్.సి. చదివాక డాక్టర్ కోర్సు పరీక్షలో అర్హత సాధించి గుంటూరు మెడికల్ కాలేజీలో ఒక వారం పాటు అన్నమ్మ గారు క్లాసు లకు కూడా వెళ్ళడం జరిగింది. చిన్నప్పటినుంచి అమ్మలాంటి అక్క ఆప్యాయతతో పెదిగిన అన్నమ్మ వెరోనిక డాక్టర్ చదువు కోసం తనను విడిచి గుంటూరు వెళ్ళిన అక్కపై బెంగాపెట్టుకొని ఆరోగ్యం విషమించే పరిస్థితికి వచ్చేసరికి పెద్దలు, డాక్టర్ల సూచన మేరకు అన్నమ్మగారు డాక్టర్ చదువును మానుకొని చెల్లెలి చెంతకు చేరుకుంది. ఆ తర్వాతా బి.ఎ.లో చేరి చదువుకున్నారు అన్నమ్మగారు.


ఇ) వివాహం,సంతానం:
7 మే 1971లో తలారి డానియెల్ గారితో అన్నమ్మ గారికి వివాహం జరిగింది. ఆయన సౌత్ సెంట్రల్ రైల్వే డ్రైవర్ గా పనిచేసి 1990 లో పదవీ విరమణ చేసి  17 సెప్టెంబర్ 1996 లో అనారోగ్య కారణంగా మరణించారు. అన్నమ్మ గారికి నలుగురు సంతానం. అన్నమ్మ గారి పెద్ద కుమారుడు టి.నెహేమ్యా వరప్రసాద్ రాజమండ్రి లో పాలిటెక్నిక్, ఆంద్ర విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్సి. కమ్యునికేషన్స్  అండ్ ఎలక్ట్రానిక్స్ పూర్తి చేసి మొదట విజయవాడ పెజేర్ లోను, ఆ తర్వాత తైవాన్ దేశంలో, అటుతర్వాత అమెరికాలోని నోకియ  కమ్యునికేషన్స్  లో ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డారు. అన్నమ్మగారి పెద్ద కోడలు ప్రేమలత అమెరికాలో టీచర్ గా పనిచేస్తున్నారు.       అన్నమ్మగారి రెండవ కుమారుడు టి.బి.ఎ.జాన్ అనీల్ కుమార్ జర్మనీలో ఎం.ఎస్.కంప్యూటర్స్ చేసి కంప్యూటర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. అన్నమ్మగారి రెండవ కోడలు ప్రియాంక బి.టెక్.చేసి ఉద్యోగం చేస్తున్నారు. అన్నమ్మగారి మూడవ కుమారుడు జాషువ ప్రవీణ్ కుమార్ ఎం.ఎస్.కంప్యూటర్స్ చేసి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఆస్ట్రేలియా లో పనిచేస్తున్నారు. అన్నమ్మగారి మూడవ కోడలు ఎమీమా ప్రశాంతి ఎలిషా  బి.టెక్.చేసి ఉద్యోగం చేస్తున్నారు. అన్నమ్మగారి నాల్గవ కుమారుడు రత్నకుమార్  ఎం.ఎస్సీ. పూర్తిచేసి సముద్ర ఐ.టి.సొల్యూ షన్స్ . విశాఖపట్నం లో పనిచేస్తున్నారు. అన్నమ్మగారి చిన్న కోడలు కాంతి సుధ. ఎం.సి.ఏ. పూర్తిచేసి యలమంచిలి  ఐ.టి.సొల్యూ షన్స్, విశాఖపట్నం లో పనిచేస్తున్నారు.

ఉద్యోగం:
విశాఖపట్నంలోని న్యూ కాలోనీ మునిసిపల్ హైస్కూల్ లో 1973 లో గ్రేడ్ 2 తెలుగు పండిట్ గా అన్నమ్మగారు ఉపాద్యాయ జీవితాన్ని ప్రారంభించారు. ఆంధ్ర విశ్వ విద్యాలయం వీసి శ్రీ లంకపల్లి బుల్లయ గారు చొరవ తీసుకొని అదనంగా ఒక సీటు పెంచడం వల్ల అన్నమ్మగారు విజయ నగరం ఎం.ఆర్.కాలేజీ లో బి.ఇడి. చేరి చదివి ప్రాక్టికల్స్, థియరీలలో ప్రథమ శ్రేణిలో పాసయ్యారు అన్నమ్మగారు. 78 లో బి.ఇడి.పోస్టు సంపాదించారు. అన్నమ్మ గారు మంచి ఉపాధ్యాయనిగా పేరు ప్రఖ్యాతులు ఆర్జించారు. టీచింగ్ ఎయిడ్స్,బోధనోపకరణలు, బోధనాంశాల వల్లే తానూ చక్కగా బోధించా గలిగానని, అందువల్లే తనకు అవార్డ్లు రివార్డ్లు వచ్చాయని అన్నమ్మగారు పేర్కొన్నారు. చాడువుకునేప్పటి నుంచే ఉపాధ్యాయులంటే ఎనలేని గౌరవం. ఆమెకూడా టీచర్ కావడానికి తనకు బోధించిన ఉపాధ్యాయులే ప్రేరణ అని అన్నమ్మ అంటారు. సహనం...ఓర్పు...ప్రేమతో విద్యార్థులను మంచి మార్గంలోకి తీసుకు రావచ్చని నమ్మి సాధించి చూపిన ఆదర్శ ఉపాధ్యాయురాలు అన్నమ్మ.
1 ) సమయపాలన - సెలవులు :
అన్నమ్మ గారు రెండుగంటల ముందే స్కూల్కు వెళ్ళడం అలవాటుగా చేసుకున్నారు. అంతేకాదు; దసరా సెలవులు, వేసవి సెలవుల్లోనూ ఆమె స్కూల్ లోనే ఉండేది. వేసవి సెలవులు పూర్తయి స్కూల్స్ పునః ప్రారంభం కాగానే పైతరగతులకు ప్రమోటైన పేర్లతో రిజిస్టర్ లన్నీ అన్నమ్మ గారే సిద్దపరచి ఉంచేవారు. ౩౦ సంవత్సరాల తన సర్వీసులో కేవలం 27 సెలవులు మాత్రమే అత్యవసర పరిస్థితుల్లో (భర్త మరణించిన రోజు, తల్లి మరణించిన రోజు, పెద్ద కుమారుని కొన్ని పుట్టిన రోజు వేడుకలకు) వినియోగించుకున్నారు అన్నమ్మ గారు.
2 ) విధులు :
ఒక్క జాతీయ పండుగకు కూడా గైర్హాజరు కాలేదు అన్నమ్మగారు. విధి నిర్వహణలో భాగంగా ఏ పని చెయ్యాల్సి వచ్చినా కుంటిసాకులు చెప్పి తప్పించుకునేది కాదు, అది సెన్సెస్ కావచ్చు...సైన్స్ ఫెయిర్ కావచ్చు!
3) సైన్స్ ఫెయిర్ లు :
1997 -1998 విద్యా సంవత్సరంలో జిల్లా స్థాయిలో జరిగిన .సైన్స్ ఫెయిర్ లో తన స్కూల్ విద్యార్థులు ప్రథమ బహుమతి పొందేలా కృషిచేసారు. 1997 -1998 మరియు 1998 -1999 విద్యా సంవత్సరాలకు గాను వరుసగా రెండేళ్ళూ జిల్లా స్థాయిలో జరిగిన .సైన్స్ ఫెయిర్ లో  ద్వితీయ బహుమతులు సాధించారు అన్నమ్మగారి స్కూల్ విద్యార్థులు. 1999 -2000 విద్యా సంవత్సరాలకు గాను జిల్లాస్థాయిలో జరిగిన .సైన్స్ ఫెయిర్ లో తన స్కూల్ విద్యార్థులు ప్రథమ,ద్వితీయ,తృతీయ బహుమతులు కైవశం చేసుకోవడంలో క్రియాశీలకపాత్ర పోషించారు అన్నమ్మ.
4 ) లో కాస్ట్ - నో కాస్ట్ టీచింగ్ ఎయిడ్స్:
దర్మాకోల్ మున్నగు వస్తువులతో లో కాస్ట్ - నో కాస్ట్ కాన్సెప్ట్ తో భోధనా సామాగ్రిని స్వయంగా తయారు చేసుకొని విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించడం అన్నమ్మగారి ప్రత్యేకత. ఇటువంటి ప్రయత్నాలతో పరీక్షల ఫలితాల విషయంలో సత్ఫలితాల్ని సాధించి చూపారు. ప్రభుత్వాధికారుల మన్ననలు పొందారు. అవార్డులు, రివార్డులూ అన్నమ్మగారు సాధించారు.
5 ) సంచాయక బ్యాంకు:
విరామ సమయంలో పిల్లలకు బ్యాగులు తయారీ, అల్లికలు నేర్పించి అలా తయారు చేసినవి ఉపాధ్యాయులకే అమ్మించి అలావచ్చిన డబ్బును పొదుపుచెయ్యడం అన్నమ్మగారు విద్యార్థులకు నేర్పించారు. ఇలా  వ్యక్తిగతంగా తయారిచేసిన వస్తువులు అమ్మగా వచ్చిన డబ్బును, వారి తల్లిదండ్రులు చిరుతిళ్ళకు ఇచ్చిన సొమ్మును వ్యక్తిగతంగా ఎవరి ఎకౌంట్లలో వారికి వేసేవారు. ఈ విధంగా చేయించి 2 సంవత్సరాల వ్యవధిలోనే 65 ,000 రూపాయలను విద్యార్థులు సమకూర్చుకునేలా చేయగలిగారు. వాటిని విద్యార్థులు వారి ఉన్నత చదువులకు వినియోగించుకునేలా మార్గాన్ని చూపారు.అలా విద్యార్థి దశలోనే వారికి పొదుపు గుణాన్ని అలవాటు చేసారు అన్నమ్మగారు.
6 ) మార్గదర్శిగా:
ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు కూడా యూనిఫారం లు ఉండాలని తన సొంత డబ్బులతో తాను పనిచేసి స్కూల్ విద్యార్థులకు కొనిపెట్టేవారు అన్నమ్మ. పిల్లలను స్కూల్స్ కు రప్పించడంలో ప్రభుత్వాలు ఇప్పుడు ఏమైతే అనుసరిస్తున్నాయో అన్నమ్మగారు వ్యక్తిగతంగా ఎప్పుడో వాటిని ఆచరించి చూపారు. ఉదా: "అక్షరజ్యోతి"పేరుతో మురికివాడల కెళ్ళి విద్యా ప్రయోజనాలగూర్చి పెద్దలకు చెప్పి వారి పిల్లలను స్కూల్స్ కు పంపే ప్రయత్నం చేసారు. లేడీసు యూరినల్స్, వాటర్ ట్యాంక్ ల నిర్మాణం, పదవ తరగతి విద్యార్థులకు స్టడీ అవర్స్ వేళ లైట్స్ ఏర్పాటు, టిఫిన్స్ ఏర్పాటు చెయ్యడం మొదలుగున్నవి. అన్నమ్మ ఆచరణలో పెట్టిన ఈ పనుల ద్వారా ఆ తర్వాత ప్రభుత్వానికి మార్గదర్శిగా నిలిచారు. ఈ అంశాలనుబట్టి అన్నమ్మను దార్శనికురాలుగా చెప్పుకోవచ్చు.


ఉ) అవార్డులు :
1 ) ప్రాంతీయ అవార్డులు :
విశాఖపట్నం, చుట్టుప్రక్కల జిల్లాల పరిధిలో  ఎన్నో సంస్థల నుంచి, ప్రభుత్వ శాఖలనుంచి ఎన్నో అవార్డులను అన్నమ్మగారు అందుకున్నారు. వాటిల్లో ముఖ్యమైనవి....
  • 1995 నుంచి 1997 వరకు వరుసగా మూడు సంవత్సరాలు జిల్లా స్థాయిలో "ఉత్తమ ఉపాధ్యాయిని"గా అవార్డులు సాధించారు.
  • 2002 సం.లో విశాఖ కలెక్టర్ నుండి "బెస్ట్ అడ్మినిస్ట్రెటర్ అవార్డు " 
  • మునిసిపల్ కమీషనర్ నుండి "బెస్ట్ టీచర్ అవార్డు"
  • బెస్ట్ హెడ్ మిస్ట్రెస్ అవార్డ్
  • 1998 సం.లో నాటి విశాఖ మేయర్ శ్రీ సబ్బం హరి బహుకరించిన కాష్ అవార్డు
  • 2004 సం.లో శిరీష ఫౌండేషన్, విశాఖపట్నం వారిచే "గురుబ్రహ్మ అవార్డు"
  • 2005 సం.లో మథర్ థెరిస్సా అవార్డ్ 
  • రావు మెమోరియల్ సంస్థ నుండి విశాఖ"మహిళా ఆణిముత్యం"అవార్డ్
  • 2004 మార్చి 8 ప్రప్రంచ మహిళా దినోత్సవం సందర్భంగా "గుంటూరు వికాస్ " వారిచే "బెస్ట్ ఉమెన్ అఫ్ ది ఇయర్ " బెస్ట్ టీచర్ అవార్డ్"
  • ౨౦౦ సం.లో విశాఖ ఎల్.ఐ.సి.వారిచే " అవార్డ్ అఫ్ ఎక్సలెన్సీ"
  • 1995,1996 సం.లలో విశాఖ మునిసిపల్  కార్పోరేషన్ నుండి ఉత్తమ అధ్యాపక అవార్డు.
  • వరల్డ్ విజన్ 
  • వై.ఎం.సి.ఎ.
  • బాల్యము సంస్థ
  • వైస్ మెన్ విశాఖ వంటి స్వచ్ఛంద సంస్థల అవార్డులు
  • 1999 నుంచి 2002  కాలంలో 7 వ తరగతిలో మంచి ఫలితాలను సాధించినందుకు   
  • 2  ) రాష్ట్రస్థాయి అవార్డు :
    • 1997 సెప్టెంబర్ 5 తారీఖు నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు చేతులమీదుగా అన్నమ్మగారు "ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు"ను స్వీకరించారు.
3) జాతీయ స్థాయి అవార్డు :
      • 2003 సం.లో అబ్దుల్ కలాం చేతులమీదుగా జాతీయ స్థాయి ఉత్తమ ఉపాద్యాయ అవార్డును స్వీకరించారు.

      • 2005 సం.లో నేషనల్ ఎకనామిక్ ఫర్ హెల్త్ ఎడ్యుకేషనల్ గ్రోత్, న్యూ డిల్లీ వారిచే విద్యారత్న గోల్డ్ మెడల్ అవార్డ్.
      • 2006 సం.లో ఆలిండియా బిజినెస్ డెవలప్ మెంట్  అసోసియేషన్ , న్యూ డిల్లీ  వారిచే భారతీయ శిక్షా (గోల్డ్ మెడల్)
      • 2007 సం.లో ఎడ్యుకేషన్ లైఫ్ టైం ఎచీవ్ మెంట్ అవార్డ్ (డిల్లీ ) పొందారు.
      • ఊ) సేవా కార్యక్రమాలు :
        అన్నమ్మగారు ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నప్పటి  నుంచే పేదపిల్లలను గుర్తించి ఎక్కువ వారితో సన్నిహితంగా ఉండేవారు. బోధించేంత వరకే వారితో ఉపాధ్యాయురాలిగా ... ఆతర్వాత తల్లిగా పిల్లలతో కలిసిపోయేది. అప్పటినుండే అన్నమ్మగారిలో సమాజసేవ చేయాలనే ఆలోచన అంతర్గతంగా ప్రారంభమైంది. అనాథలకు, పేద విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలను తన సొంత ఖర్చులతోనే  సమకూర్చారు. ఎందరో పేద విద్యార్థినీ, విద్యార్థుల అభ్యున్నతికి బంగారు బాట వేసారు. తన పిల్లలతో పాటు మరికొంతమంది పిల్లలకు అన్నం వండి క్యారియర్ తీసుకుపోవడం చేసేవారు. చింపిరి జుట్టుతో వచ్చిన పిల్లలకు స్వయంగా తానే తలదువ్వి జడలు వేసి సంస్కరించేవారు అన్నమ్మగారు. ముఖం కడిగి శుభ్రపరిచేది. చడువుకునేప్పటినుంచే తానూ ఇంకొకరికి సహాయపడాలనే ఆలోచనతో సహాయపడుతూ ఉండేది. 
             తల్లిదండ్రులు బంధువులమధ్య గారాబంగా పెరగడం చేత తనకు వారు తీసుకొచ్చే రెండు జతల దుస్తులలో ఒక జత పేద విద్యార్థినికి ఇచ్చేది. తనలాగే ఇతరులుకూడా ఉండాలనేదే అన్నమ్మ భావన. ఉద్యోగం వచ్చాక కూడా ఇతరులకు ఇలా సహాయ పడుతుంటే తన భర్త ఏనాడు అడ్డు చెప్పలేదు కదా ..." మీ అమ్మ మనసుకు ఏది సంతోషాన్ని కలిగిస్తే దానిని చెయ్యనివ్వండి గాని బాధపడేలా ప్రవర్తించవద్దని " చెప్పేవాడని భర్త మాటలు గుర్తుకు తెచ్చుకొని చెప్తుండగా అన్నమ్మగారి కళ్ళల్లో కన్నీళ్లు ఉబికాయి. ఆ విధంగా భర్త ప్రోత్సాహంతో ఇతరులకు సహాయపడుతూ ఉండేది. భర్త వైద్యం కోసం ఎన్నో లక్షలు ఖర్చుచేసింది. భర్త మరణానంతరం ఆర్ధిక ఇబ్బందులతో పెద్దకుమారుడు వరప్రసాద్ పెద్ద చదువులు చదువుకునే పరిస్థితి లేక రాజమండ్రిలో పాలిటెక్నిక్ లో చేరి చదువుకున్నాడు. ఇలా అన్నమ్మగారు ఎంతో కస్టపడి పిల్లలను చదివించింది. పిల్లలు బాగా చదువుకుని ప్రయోజకులై విదేశాలలో స్థిరపడి వారి వంతు సహాయం కూడా అందించడం ప్రారంభించారని అన్నమ్మ ఆనంద భాష్పాలతో పలికింది. తన పెద్ద కుమారుడిలా ఆర్ధిక ఇబ్బందులతో ఎవరూ చదువు మానుకోకూడదనే ఆలోచనతో పేదవిద్యార్థుల విద్యకు ఆర్ధిక సహాయాన్ని అందించాలని భావించింది.
             ఆకలితో ఉన్నవారికి అన్నం,వస్త్రాలు లేనివారికి వస్త్రాలు, జబ్బుతో ఉన్నవారికి వైద్యం, ఇలా ఎన్నో అవసరాలను తీర్చేది ఒక్కవిద్యేనని గ్రహించి మెరిట్ ఉన్న పేద విద్యార్థులను గుర్తించి సహాయపడడం ప్రారంభించారు అన్నమ్మగారు. పల్లెటూళ్ళలోనే మట్టిలో మానిక్యాలున్తాయని గుర్తించిన అన్నమ్మ గారు ఆర్ధిక సహాయాన్ని అందించడం ప్రారంభించారు. మొదట విశాఖపట్నంలోని పేద విద్యార్థులకు అన్నమ్మ సహాయం చెయ్యడం ప్రారంభించి 

         ఆ తర్వాత  గ్రామీణ  ప్రాంతాలలోని  ప్రభుత్వ స్కూల్స్ కు , ఆ స్కూల్లో చదివే పేద విద్యార్థులకు ఆర్ధిక సహాయాన్ని అందించడం విస్తరింపజేశారు అన్నమ్మ. అటువంటి పేద విద్యార్థులను అందుకోవడం కోసం గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ స్కూల్స్ ను దత్తతు తీసుకొని వారి అభివృద్ధికి ఆర్ధిక తోడ్పాటును అందిస్తూ ఉన్నారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహ బహుమతులను అందిస్తున్నారు. మంచి పట్టు చీర కొనుక్కోమని విదేశాలల్లోని తన పిల్లలు పంపే డబ్బులు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూసి ఆ డబ్బులు అందుకోగానే మామూలు చీరను కొనుక్కొని మిగతా డబ్బును సేవా కార్యక్రమాలకు అన్నమ్మ వినియోగించేవారు. భర్త చనిపోవడంతో తనను అలుముకున్న దుఖం ,  నిరాశ, నిస్ప్రుహలనే చీకటి నుండి బయటపడడానికి సేవా కార్యక్రమాలవైపు తన దృష్టిని పెట్టడంలో మరో కారణంగా అన్నమ్మ తెలియజేశారు. 
        అ) స్కూల్స్ కు విరాళాలు :
        అన్నమ్మ గారు చిన్నప్పటి నుంచి తనకున్న దానిలో కొంత పేదవారికి ఖర్చు చేయ్యదమేగాక , ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా సహాయ కార్యక్రమాలను ఆపకుండ,  తన పదవీవిరమణ అనంతరం కూడా సహాయ కార్యక్రమాలను కొనసాగించడం అభినందించదగిన విషయం.అన్నమ్మ గారు తన పెన్షన్ డబ్బులు, తన భర్త పెన్షన్ డబ్బులు, తన ఇంటిద్వార అద్దె రూపంలో వచ్చే డబ్బులు, విదేశాలలోని తన కుమారులు పంపే డబ్బులు తన సహాయ కార్యక్రమాలకు ఆర్ధిక వనరులుగా సమకూర్చుకుంటూ సేవచేస్తున్నారు.
        1 ) జి.వి.యం.సి.స్కూల్, రైల్వే న్యూ కాలనీ :
        ఎస్.అన్నమ్మగారు ఈ స్కూల్లో ఉన్న 200 మంది పేద విద్యార్థులకు అన్నమ్మగారు యూనిఫార్మ్స్ తో పాటు బెల్టులు,టైస్, చెప్పులు తదితర వస్తువులు అందజేశారు . విద్యార్థులు రాసుకోడానికి నోటు పుస్తకాలు, బ్యాగులు,మధ్యాహ్నం భోజనం కొరకు కంచాలు, గ్లాసులు బహూకరించారు. గోడలమీద టీచింగ్ ఎయిడ్స్ రాయించారు. అలాగే స్కూల్ కు రెండు ఫ్యాన్లు , నాల్గు కుర్చీలు, ఒక మెగాఫోను, 40 మంది పిల్లలకు కూర్చునేందుకు కుర్చీలు బహుకరించారు. సి.ఇ.సి.సెంటర్ పిల్లలకు ఆటవస్తువులు బహుకరించారు. దీనికి మొత్తం 46 ,400 రూపాయలు ఖర్చుచేశారు.
        1 ) జి.వి.యం.సి.స్కూల్,సి.బి.ఎం. దొండపర్తి  :
        ఈ స్కూల్ లోని 130 మంది పేదపిల్లలకు యూనిఫారమ్స్,పలకలు అందజేశారు. మొత్తం 200 మంది పిల్లలు. వీరందరికీ బెల్టులు, టైలు, చెప్పులు, నోటు పుస్తకాలు అందజేశారు. స్కూల్ కు రెండు కుర్చీలు, ఒక మెగా ఫోను బహుకరించారు.పిల్లలు కూర్చోడానికి 80 కుర్చీలు అందజేశారు. ఈ స్కూల్ కు మొత్తం 32 ,600 రూపాయలు ఖర్చుచేశారు.
1 ) జి.వి.యం.సి.స్కూల్, రైల్వే న్యూ కాలనీ :
ఎస్.అన్నమ్మగారు ఈ స్కూల్లో ఉన్న 200 మంది పేద విద్యార్థులకు అన్నమ్మగారు యూనిఫార్మ్స్ తో పాటు బెల్టులు,టైస్, చెప్పులు తదితర వస్తువులు అందజేశారు . విద్యార్థులు రాసుకోడానికి నోటు పుస్తకాలు, బ్యాగులు,మధ్యాహ్నం భోజనం కొరకు కంచాలు, గ్లాసులు బహూకరించారు. గోడలమీద టీచింగ్ ఎయిడ్స్ రాయించారు. అలాగే స్కూల్ కు రెండు ఫ్యాన్లు , నాల్గు కుర్చీలు, ఒక మెగాఫోను, 40 మంది పిల్లలకు కూర్చునేందుకు కుర్చీలు బహుకరించారు. సి.ఇ.సి.సెంటర్ పిల్లలకు ఆటవస్తువులు బహుకరించారు. దీనికి మొత్తం 67 ,600 రూపాయలు ఖర్చుచేశారు.
2 ) జి.వి.యం.సి.స్కూల్,సి.బి.ఎం. దొండపర్తి :
ఈ స్కూల్ కు మొత్తం ౧,౪౧,900 లోని 130 మంది పేదపిల్లలకు యూనిఫారమ్స్,పలకలు అందజేశారు. మొత్తం 200 మంది పిల్లలు. వీరందరికీ బెల్టులు, టైలు, చెప్పులు, నోటు పుస్తకాలు అందజేశారు. స్కూల్ కు రెండు కుర్చీలు, ఒక మెగా ఫోను బహుకరించారు.పిల్లలు కూర్చోడానికి 80 కుర్చీలు అందజేశారు. ఈ స్కూల్ కు మొత్తం 49,800 రూపాయలు ఖర్చుచేశారు.


3) జి.వి.యం.సి.ప్రాథమికోన్నత స్కూల్:
ఈ స్కూల్ కు మొత్తం 27 ,300 రూపాయలు ఖర్చు చేసారు అన్నమ్మగారు. ఈ స్కూల్ లో 1 నుండి 7 వ తరగతి వరకు చదువుతున్న పిల్లలందరికీ నోట్ బుక్స్  అందజేశారు. 100 మంది పిల్లలకు యూని ఫార్మ్స్ అందించారు. మధ్యాహన్న బోజనానికి ప్లేటులు,కంచాలు, గ్లాసులు అందజేశారు. ఈ స్కూల్ కి కుర్చీలు, ఒక మెగా ఫోను బహుకరించారు. 


04 ) జి.వి.ఎం.సి. స్కూల్, పెదవాల్తేరు : ఈ స్కూల్ కు 9 ,000 రూపాయలు  ఖర్చు చేసి పిల్లలకు బ్యాగులు,చెప్పులు బహుకరించారు.
05 ) జి.వి.ఎం.సి. స్కూల్, కప్పరాడ : ఈ స్కూల్ కు  మొత్తం 85 మందికి యూనిఫారమ్స్, నోట్ బుక్స్, పలకలు అందజేశారు. విద్యార్థులందరికీ తిలూ, బెల్టులు అందజేశారు. మధ్యాహ్న భోజనానికి కంచాలు, గ్లాసులు అందజేశారు. స్కూల్ కు నాలుగు కుర్చీలు, ఒక మెగా ఫోను బహూకరించారు. ప్రతి సంవత్సరం పుస్తకాలు,  బ్యాగులు, బెల్టులు మొదలగున్నవి ఈ స్కూల్ కు బహుకరిస్తున్నారు.  ఇప్పటివరకు ఈ స్కూల్ కు 36 ,700 రూపాయలు ఖర్చు చేశారు.
06 ) జి.వి.ఎం.సి. స్కూల్, కప్పరాడ : ఈ స్కూల్ విద్యార్థుల నోట్ పుస్తకాలకు, బ్యాగులు, బెల్టుల కొరకు , 2011 విద్యా సంవత్సరంలో క్రొత్తగా చేరిన పేద విద్యార్థుల ఫీజు కొరకు 5 ,200 రూపాయలు ఖర్చుచేశారు.
07 ) జి.వి.ఎం.సి. స్కూల్, కరస : ౩౦ మంది పేద పిల్లలకు యూనిఫారమ్స్, పలకలు అందజేశారు. పిల్లలందరికీ నోట్ బుక్స్, బెల్ట్  లు, టైలు అందజేశారు. స్కూల్కు ఒక మెగా ఫోను బహుకరించారు. మొత్తం 28 ,400 రూపాయలు ఈ స్కూల్ కు ఇప్పటివరకు ఖర్చు చేశారు. ప్రతి సంవత్సరం పుస్తకాలు, బ్యాగులు, బెల్టులు మొదలగున్నవి ఈ స్కూల్ విద్యార్థులకు బహుకరిస్తున్నారు.
08 ) జి.వి.ఎం.సి. స్కూల్, మాధవధార : 2012 విద్యాసంవత్సరంలో చేరిన విద్యార్థినీ విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు, బెల్టుల కొరకు 4,000 రూపాయలు అన్నమ్మగారు ఖర్చుచేశారు.
09  ) జి.వి.ఎం.సి. స్కూల్, రామచంద్ర స్కూల్ :300 మందికి యూనిఫారమ్స్ అందజేశారు. పిల్లలందరికీ నోటు పుస్తకాలు, పలకలు అందజేశారు. మధ్యాహ్న భోజనానికి అవసరమయ్యే గ్లాసులు కంచాలు, అందజేశారు.స్కూల్ కు ఒక మెగా ఫోను బహుకరించారు. వీరి మొత్తానికి 67 ,500 రూపాయలు ఖర్చు చేశారు.
10  ) జి.వి.ఎం.సి. స్కూల్, బర్మా కోలనీ : 2011 విద్యా సంవత్సరంలో చేరిన విద్యార్థినీ  విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు, బెల్టుల కొరకు 4 ,000 రూపాయలు అన్నమ్మగారు ఖర్చు చేశారు. ఇప్పటివరకు ఈ స్కూల్ కు 8 ,000 రూపాయలు ఖర్చు చేశారు.
11 ) జి.వి.ఎం.సి. స్కూల్, ధర్మనగర్ : 100 మంది పేద విద్యార్థులకు యూనిఫారమ్స్, పలకలు అందజేశారు. పిల్లలందరికీ నోట్ పుస్తకాలు, బెల్టులు అందజేశారు. మధ్యాహ్న భోజనానికి అవసరమయ్యే కంచాలు, గ్లాసులు అందజేశారు. స్కూల్ కి ఒక మెగా ఫోను బహుకరించారు. దీనికి మొత్తం 36 ,600 ఖర్చుచేశారు.
01) జి.వి.ఎం.సి. స్కూల్, రైల్వే న్యూ కోలని, వైజాగ్:
02) జి.వి.ఎం.సి. స్కూల్, సి.బి.ఎం. దొండపర్తి:
03) జి.వి.ఎం.సి. స్కూల్, బుచ్చిరాజు పాలెం:
04) జి.వి.ఎం.సి. స్కూల్, పెదవాల్తేరు:
05) జి.వి.ఎం.సి. స్కూల్, సాకేత పురం:
06) జి.వి.ఎం.సి. స్కూల్,కప్పరాడ:
07) జి.వి.ఎం.సి. స్కూల్, కరస:
08) జి.వి.ఎం.సి. స్కూల్, మాధవ ధార:
09) జి.వి.ఎం.సి. స్కూల్, రామచంద్ర స్కూల్:
10) జి.వి.ఎం.సి. స్కూల్, బర్మా కోలని:
11) జి.వి.ఎం.సి. స్కూల్, ధర్మనగర్:
12) జి.వి.ఎం.సి. స్కూల్, ఎన్.జి.ఓస్ కోలని:
13) మండల పరిషత్ ప్రాథమిక స్కూల్, రేకవాని పాలెం:
14)  మండల పరిషత్ ప్రాథమిక స్కూల్, ముసలయ్య పేట, సాగర్ నగర్:
15) జి.వి.ఎం.సి. హైస్కూల్ , మల్కాపురం:
16) మండల పరిషత్ ప్రాథమిక స్కూల్-1, వెదురుపర్తి:
17) మండల పరిషత్ ప్రాథమిక స్కూల్-2, వెదురుపర్తి:
18) జిల్లా పరిషత్ హైస్కూల్,వెదురుపర్తి:
19) జిల్లా పరిషత్ హైస్కూల్, కొండకర్ల:
20) మండల పరిషత్ ప్రైమరీ స్కూల్, కశింకోట:
21) కె.ఎన్.ఎం.జి. హైస్కూల్,జి.వి.ఎం.సి. విశాఖ:
22) మునిసిపల్ కార్పోరేషన్ స్కూల్, న్యూ కోలని:
23) మునిసిపల్ కార్పోరేషన్ స్కూల్, మాధవ ధారా:
24) జిల్లా పరిషత్ హైస్కూల్, తాళ్ళ పాలెం:
25) జిల్లా పరిషత్ హైస్కూల్, బయ్యవరం:
26) జిల్లా పరిషత్ హైస్కూల్, గంగవరం:
27) ఎం.పి.పి. స్కూల్, గంగవరం:
28) జిల్లా పరిషత్ హైస్కూల్, ఎల్లపువానిపాలెం:
29) జిల్లా పరిషత్ హైస్కూల్, నరవ:
30) మునిసిపల్ ప్రైమరీ స్కూల్, కపడిపాలెం, నెల్లూరు:
31) జి.వి.వి.కె. హైస్కూల్స్, జి.మాడుగుల:
32) డా.ద్వారకానాథ్ ప్రభుత్వ వైద్య కళాశాల, శ్రీకాకుళం:
33) ఎస్,సౌజన్య, బి.టెక్ . తృతీయ సంవత్సరం:
34) పాలిటెక్నిక్ విద్యార్థి, తాళ్ళ పాలెం:
35) బంధు వర్గంలోని పేదవిద్యార్థులకు  సహాయం:
36) చర్చి పాస్టర్ కుమారుకిని విరాళాలు:
37) ఇంటర్  విద్యార్థినీ విద్యార్థులకు:
38) కింగ్ జార్జ్ హాస్పటల్ కు విరాళము:




ఓల్డేజ్ హోం లకు విరాళాలు :
1 ) ఇరువాడ గ్రామం లో ఓల్డేజ్ హోం నిర్మాణమునకు 1 లక్ష రూపాయలు వెచ్చించారు.
2 ) ప్రియదర్శిని వృద్ధాశ్రమానికి 1997 నుండి నేటి వరకు వృద్ధులకు బట్టలు, టవల్స్ ఇస్తున్నారు. ప్రతి శుక్రవారం బిస్కెట్లు, పండ్లు పంచడం అలాగే సబ్బులు, రోగాలతో బాధపడుతున్న వారికి మెడిసిన్స్  అందజేస్తున్నారు అన్నమ్మ. 
3 ) 2007 నుంచి ప్రతి సంవత్సరం సెంట్ జోసెఫ్ ఓల్డేజ్ హోం లోని 42 మందికి బట్టలు అందజేస్తున్నారు. వారికి అవసరమైన వంట సామాగ్రి కొనుగోలు చేశారు. అలాగే 30 బక్కెట్లు, 30 మగ్గులు అందజేశారు. ఇలా ఎందరో పేద ప్రజలకు చీరలు, తువ్వాళ్ళు .
డి) అనాధ ఆశ్రమానికి విరాళము :
కరాసలోని పాస్టర్ శేఖర్ గారి నేతృత్వంలో నడుస్తున్న అనాధ   పిల్లల హాస్టల్ కు 1997 నుండి  ప్రతినెల 40 మంది పిల్లలకు కావలసిన స్నానపు సబ్బులు, బట్టలుతికే సబ్బులతో పాటు 4 కేజీల కందిపప్పుకు అవసరమయ్యే 500 రూపాయలు అందజేస్తున్నారు. అలాగే ప్రతియేటా జూన్ మాసంలో వారికి కావలసిన యూనిఫామ్స్, నోట్ బుక్స్ ఇవ్వడం,ప్రతి సంవత్సరం క్రిస్టమస్ రోజు వారికి బట్టలు, విందు భోజనం ఏర్పాటు చేస్తున్నారు.
ఇ ) వరద బాధితులకు సహాయం :
గుంటూరుజిల్లా రేపల్లెలో వరద బాధితులకు అన్నమ్మగారు తన సహచరులతో బస్సుపై వెళ్లి చర్చీలలో దుప్పట్లు, పంచెలు, చీరలు, బియ్యం, పేస్టులు, బ్రష్ లు, టవల్స్ పంచడం జరిగింది.
ఎ) విదేశ పర్యటనలు :
అన్నమ్మగారి ఇప్పటివరకు అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియా దేశాలకు కుమారుల వద్దకు వెళ్లి రావడమేగాకుండా, సింగపూర్, బర్మా, యెరుషలేము, అండమాను దేశాలను, ప్రాంతాలను సందర్శించారు.  
ఏ) స్ఫూర్తి ప్రదాత :
అన్నమ్మగారు తానూ పేదలకు, పేద విద్యార్థులకు ఆర్ధిక సహాయం చేస్తూ సహచరులకు స్పూర్తిని కలిగించారు. అన్నమ్మగారి కుటుంబ శ్రేయోభిలాషి, మిత్రురాలు కనక రత్నం గారు అన్నమ్మగారి దాతృత్వాన్ని స్పూర్తిని తీసుకొని ఆమెకూడా తన భర్త స్మృత్యార్థం సంవత్సరానికి 5 ,000 రూపాయల చొప్పున గత రెండేళ్ళ నుంచి సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నారు.
     అదేవిధంగా రాజేశ్వరీలింకన్ గారు కూడా అన్నమ్మగారి సేవా కార్యక్రమాలను స్పూర్తిగా తీసుకుని ఆమెకూడా తన భర్త స్మృత్యర్థం సంవత్సరానికి 5 ,000 రూపాయల చొప్పున గత రెండేళ్ళ నుంచి సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నారు ఈ రకంగా తన సేవా కార్యక్రమాలతో అన్నమ్మగారు స్పూర్తిప్రదాతగా నిలిచారు.
ఏ) సందేశం :
     30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఉపాధ్యాయినిగా, తన ప్రతిభను నిరూపించుకుని రాష్ట్ర,  జాతీయ "ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు"లు  ఇంకా అనేక పురస్కారాలు, సన్మాన, సత్కారాలను పొందిన విద్యావేత్తగా, విద్యార్థుల - సహచర ఉపాధ్యాయుల తత్వాలను దగ్గరగా ఉండి గమనించి ప్రధానోపాధ్యాయినిగా విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి వారు వారి బాధ్యతలను ఎలా నిర్వర్తించాలనే అన్నమ్మగారు తన సందేశాన్ని తెలియజేశారు.  
1 ) విద్యార్థినీ, విద్యార్థులకు :
     దృఢ సంకల్పం ఉంటే ఈ లోకంలో సాధ్యం కానిదేదీ లేదని, విద్యతోనే ఏదైనా సాధించవచ్చని విద్యార్థులు గ్రహించి ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత స్థితికి చేరుకోవాలని అన్నమ్మగారి ఆకాంక్ష. ఆర్ధిక ఇబ్బందులను బట్టి చదువు ఆపివేయ్యకుండా తమ చదువుకోసం తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో గమనించి, ఉపాధ్యాయుల పట్ల గౌరవ, విదేయతలను చూపుతూ విద్యార్థులు విద్యనూ ఆర్జించాలని అంటారు అన్నమ్మ.
2 ) ఉపాధ్యాయ వర్గానికి :
     మన బిడ్డలమీద చూపించే ప్రేమలో పదిశాతం విద్యను అభ్యసించే మన విద్యార్థులపై చూపితే వారి భవిష్యత్తు బంగారంలా ఉంటుందని ఉపాధ్యాయుల్ని ఉద్దేశించి అంటారు అన్నమ్మ! దేశ నిర్మాతలను తయారు చేసే పవిత్ర వృత్తి ఉపాద్యాయులదిగా అందరూ గుర్తించి అంకితభావంతో పనిచెయ్యాలని అంటారు. స్కూల్ ఆవరణలోకి ప్రవేశించగానే వ్యక్తిగత విషయాలను విడిచి విద్యార్థుల కొరకు పనిచెయ్యాలని అన్నమ్మగారి ఆకాంక్ష.
    Posted by Unknown at 10:31 No comments:
    Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

    About Smt.S.Annamma Teacher

    Posted by Unknown at 09:57 No comments:
    Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

    Wednesday, 15 August 2012

    Greetings to Smt.S.Annamma Teacher


    Posted by Unknown at 19:48 No comments:
    Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
    Labels: ఫొటోస్

    అన్నమ్మ టీచర్




















    Posted by Unknown at 07:04 No comments:
    Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
    Labels: ఫొటోస్

    వక్తగా అన్నమ్మ టీచర్

    వృతి రీత్యా అన్నమ్మ గారు ఉపాధ్యాయురాలు. ఇష్టంతో ఈ వృతిని ఎంచుకున్నవారు,పిల్లలకు  నిత్యం భోదించడం ఆమెకు అత్యంత ఇష్టమైన పని. మంచి వాక్పటిమగల వక్తగా అన్నమ్మ గారికి పేరుంది. వివిధ సందర్భాలలో,సభల్లో, సమావేశాల్లో  వక్తగా మాట్లాడే దృశ్యాలే ఇందులోని ఫోటోలు.

























    Posted by Unknown at 07:02 No comments:
    Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
    Labels: ఫొటోస్

    సన్మాన సత్కారాలు స్వీకరిస్తున్న అన్నమ్మ

    అన్నమ్మగారు విద్యారంగానికి చేసిన సేవలకు గాను, తానూ నిస్వార్థంగా చేసిన సామాజిక సేవకుగాను, విద్యా బోధనలో చూపిన ప్రతిభకు గాను ఆమెకు లభించిన సన్మాన సత్కారాలు తక్కువే! అన్నమ్మ ఏనాడు ఇతరులు తనను గుర్తించాలని గాని, అవార్డులు పొందాలని గాని చెయ్యలేదు. తను చెయ్యాలనుకున్న సేవా కార్యక్రమాలు చేసుకు పోతున్న క్రమంలో వచ్చిన అవార్డులు, రివార్డ్ లు, అన్నమ్మ ప్రతిభను,సేవలను గుర్తించి కొందరు సహృదయులు చేసిన సన్మాన సత్కారాలకు సంబంధించినవే ఈ ఫోటోలు.














































    Posted by Unknown at 06:58 No comments:
    Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
    Labels: ఫొటోస్
    Older Posts Home
    Subscribe to: Posts (Atom)

    Total Pageviews

    Popular Posts

    • About Annamma Teacher
      THE CREST JEWEL OF TEACHING COMMUNITY Smt.S.AnnammaGaru , GURU BRAHMA – GURU VISHNU – GURUDEVO MAHESWARA – GURU SAKSHAT PRABRAHMA – TAS...
    • Sri Kasa Venkata Srinivas Essay On Smt. Anamma Teacher Charity
    • అన్నమ్మ టీచర్: About Smt.S.Annamma Teacher
      అ) తల్లిదండ్రులు, జననం,బాల్యం: అన్నమ్మ గారు ఆరోగ్యమ్మ,శ్రీ జోసెఫ్ పుణ్య దంపతులకు 17 జులై 1947 లో నెల్లూరు జేమ్స్ గార్డెన్స్ లో...
    • Smt. ANNAMMA garu WELCOME TO INDIA
    • సన్మాన సత్కారాలు స్వీకరిస్తున్న అన్నమ్మ
      అన్నమ్మగారు విద్యారంగానికి చేసిన సేవలకు గాను, తానూ నిస్వార్థంగా చేసిన సామాజిక సేవకుగాను, విద్యా బోధనలో చూపిన ప్రతిభకు గాను ఆమెకు లభించిన సన్...
    • Greetings to Smt.S.Annamma Teacher
    • Annamma Savarapu
      welcome to my Blog
    • అన్నమ్మ టీచర్
    • About Smt.S.Annamma Teacher
    • వక్తగా అన్నమ్మ టీచర్
      వృతి రీత్యా అన్నమ్మ గారు ఉపాధ్యాయురాలు. ఇష్టంతో ఈ వృతిని ఎంచుకున్నవారు,పిల్లలకు  నిత్యం భోదించడం ఆమెకు అత్యంత ఇష్టమైన పని. మంచి వాక్పటిమగల వ...

    Blog Archive

    • ▼  2012 (43)
      • ▼  December (2)
        • Smt. ANNAMMA garu WELCOME TO INDIA
        • Sri Kasa Venkata Srinivas Essay On Smt. Anamma Te...
      • ►  August (41)

    About Me

    Unknown
    View my complete profile

    THE CREST JEWEL OF TEACHING COMMUNITY Smt.S.AnnammaGaru

    ­
    GURU BRAHMA – GURU VISHNU – GURUDEVO MAHESWARA – GURU SAKSHAT PRABRAHMA – TASMAI SRI GURUVENAMAH – It is no exaggeration to say that no profession other than teaching profession received the respect, honour and position worthy of worship in the society. Presidential awardee Smt. AnnammaGaru stood as embodiment of such a holy profession by doing justice, she has been catering to the needs of many poor and destitute children as a parent and providing education as a teacher and even after retirement with renewed enthusiasm, she has been extending her sevices and providing direction to many poor students of not only the schools in the jurisdiction of GVMC but also the schools in sub urban and rural areas.

    CHARITABLE ACTIVITIES SINCE 1973
    She started her social service ever since she has joined the teaching career at Municipal high school, New colony, Visakhapatnam. She is providing dresses and books to many destitute and poor children with her non resources. She created a new trend in the teaching community with her activities like, attending the school well advance to the scheduled time, oiling the hair in braids for disheveled students, providing uniforms to the children infusing discipline among students and thereby made the parents felt ashamed of their negligence and realize their responsibilities towards their children Mrs. Annammagaru is a great orator, she has no parallel in stimulating and influencing the children, parents and teachers with her inspiring speech.

    In 1992, she adopted 10 poor students, and provided food and other amenities at her home she educated them upto X class and shown employment opportunities to them.

    CONSTRUCITON OF ADDITIONAL SCHOOLBUILDING
    In 1996, she joined in MunicipalCorporationUpperPrimary School, Butchirajupalem on transfer. At that time the construction of 5 additional rooms at a cost of Rs.4.25 lakhs is sanctioned. As she could not satisfied with structural design given by the engineers without columns, she asked the contractor to construct the same with columns only for that she is ready to pay the additional amount.In this connection she immediately offered Rs.1 Lakh to complete the building and received many accolades from the education department. She voluntarily carried bricks for the construction and also white washed the school buildings exhibiting her commitment.

    She inculcated the habit of thrift among children with the launch of money savings scheme and could mobilize Rs.65,000/- in just 2 years time.

    She was instrumental in bagging 1st, 2nd and 3rd prizes at District level science fair during 1997-2000 with her innovative low cost – No cost concept in making teaching aids.

    She has been distributing clothes to 40 old age persons of VisakhaPriyadarshini home for the aged every year. She has proved that service to humanity is service to god with her generous contributing in providing uniforms, note books, pencils, play items, writing pads, ribbons etc to many poor children every year. She is praised by all for her motherliness, humanitarianism and generosity.

    HAPPINESS OF HAVING SONS
    Smt. Annammagaru blessed with 4 sons, the eldest Mr. T.N.V. Vara Prasad (USA), 2nd Son Mr. John Anil Kumar (Germany), 3rd Son Mr. Joshuva Praveen Kumar (Australia) and 4th son Ratnakumar. All the 4 sons have been giving due respect to their mother’s words and contributing liberally for the charitable activities taken up by her. Not only her sons but also her daughter-in-laws 1) Mrs. Prema Latha. 2) Mrs. PriyankaLizz 3) Mrs. EmimaPrasanthi Elisha 4) Mrs. KanthiSudha respectively are encouraging her activities. She meets all this amout spent towards these charitable activities came only from her pension, her husband late Mr. Daniel’s Pension and the amount sent by her sons in respect of her mother on several occassionsand also she has happy movements with her grand sons Mr. Ratna Daniel of her elder son Mr. Akhil Stephen of her second son and Anna Sunayana of her fourth Son.

    AWARDS AND REWARDS
    She crowned many awards and rewards for her relentless services in the field of education as well as community service. She was adjudged as the best teacher district level consectively for 3 years during 1995 to 1997. In 1997 she was awarded State Level best Teacher award and during 1998 – 2008 she received many awards. She was honoured cash rewards and awards from the Municipal Corporation for the outstanding centpercent results she achieved at 7th class examaintion from 1999 to 2002. She received the National Best Teacher Award through the hands of His excellency Dr. APJ Abdul Kalam, President of India in 2003. She also received national levelVidyaratna Gold Medal from National Economic for Health and Educational Growth (NEHEG), New Delhi in 2005.In 2006 she received BharatiyaSiksha Gold Medal from All India Business Development Association, New Delhi. In 2007 She got Education Life Time Achievement Award, awarded by Global society for health and educational growth, New Delhi. She was honoured with so many awards and rewards from many government of non government agencies and educational institutions.

    The national best teacher awardee Smt. Annammagaru is very unique, in her entire serviced career spanning 32 years she availed of only 27 leaves at an average of 1 leave per year though she was entitled for 15 CLS + 7 Spl. CLS + 5 (women) leaves per annum by the Government.

    Smt. AnnammaGaru availed only one leave per year since her joining in service in 1973 that too for celebrating birth day of her eldest son of Feb. 09 and on the demise of her husband Mr. Daniel on sep. 17th 1996. She stopped availed leaves for birthdays as the children are grown. She availed leave on 31st July 2003 on the demise of her mother. So she is a great personality availed only one leave on average till her retirement on 31st July, 2005. Her autobiography is really an inspiring source to the entire teaching community.

    INSPIRER
    Inspired by her charitable activities Mrs. Kanaka Ratnam colleague and wellwisher to her family extends her service to the charitable activities by adding Rs. 5000/- per year for the last two years in memory of her husband.
    Another lady Mrs. Rajeswari Lincoln also inspired from her charitable activities and came forward to give Rs. 5000/- every year for the last two years in fond memory of her husband.
    MESSAGE
    Teachers should be punctual, committed to teaching and be a role model to the students and they should not resort to their dereliction of their duties for any reason or indulge in activities leading to wrong path of students.
    Prepared by
    - KASA.V.SRINIVASA RAO, S.A (Eng),
    Z.P.H.S.,
    Yellapuvanipalem.

    POTNURU SWAMY NAIDU, J.L. ,
    Govt. Jr.College,
    Itchapuram.

    ­
    అన్నమ్మ గారు శ్రీమతి ఆరోగ్యమ్మ,శ్రీ జోసెఫ్ పుణ్య దంపతులకు 17 జులై 1947 లో నెల్లూరు లో జన్మించారు, తాత కోట్లపుడి దేవదాసు. పల్లెటూళ్ళకు తిరిగి వైద్యసహాయం అందిస్తూ ఉండేవారు. 12 సంవత్సరాలపాటు అన్నమ్మగారు తాతగారి ఆలనా పాలనలోనే పెదిగారు. తాతాగారి ప్రేమను చూరగొనడమే కాదు; మామయ్యల గారాబాల ముద్దు బిడ్డగా పెరిగింది. అన్నమ్మ గారికి ఒక చెల్లెలు, ఇద్దరు తమ్ముళ్ళు.

    విద్యాభ్యాసం:
    నేల్లోరేలోని సేన్ జోసెఫ్ స్కూల్ లో అన్నమ్మ ప్రాథమికోన్నత విద్యను పూర్తి చేశారు. ఆ రోజుల్లో ఎస్.ఎస్.ఎల్.సి., టెన్త్ క్లాసు లాంటివి లేవు. ఈ విద్యార్హతకు సమాన స్థాయిగా పరిగణించే హెచ్.ఎస్.సి. ఉండేది. అది చదివాక డాక్టర్ కోర్సు పరీక్షలో అర్హత సాధించి గుంటూరు మెడికల్ కాలేజీలో చేరి రెండు వారాలపాటు క్లాసు లకు కూడా వెళ్ళడం జరిగింది. చిన్నప్పటినుంచి అమ్మలాంటి ఆప్యాయతతో అక్క వద్ద పెదిగిన ఆ చెల్లెలు డాక్టర్ చదువు కోసం తనను విడిచి గుంటూరు వెళ్ళిపోవడం తో అక్కపై బెంగాపెట్టుకొని ఆరోగ్యం విషమించే పరిస్థితికి వచ్చేసరికి డాక్టర్ చదువును అర్థాంతరంగా వదిలేసి తన చేల్లెలిదగ్గరకు వెళ్ళిపోయారు అన్నమ్మగారు.ఆ తర్వాతా బి.ఎ.చదవడం జరిగింది.

    వివాహం,సంతానం:
    అన్నమ్మగారికి 1971 లో శ్రీ తలారి డానియెల్ గారితో వివాహం జరిగింది.వారికి నలుగురు సంతానం. టి.ఎస్.వి.వరప్రసాద్(అమెరిక) జాన్ అనీల్ కుమార్ (జర్మనీ) ,జాషువ ప్రవీణ్ కుమార్ (ఆస్ట్రేలియా)లు విదేశాలలో ఉద్యోగం చేస్తూ ఉండగా చిన్న కుమారుడు రత్నకుమార్ విశాఖపట్నంలో తల్లి చెంతనే ఉన్నాడు. ప్రేమలత,ప్రియాంక లిజ్, ఎమిమా ప్రశాంతి ఎలిషా,కాంతి సుధలు అన్నమ్మ గారి కోడళ్ళు.

    ఉద్యోగం:
    విశాఖపట్నంలోని న్యూ కాలోనీ మునిసిపల్ హైస్కూల్ లో 1973 లో గ్రేడ్ 2 తెలుగు పండిట్ గా అన్నమ్మగారు ఉపాద్యాయ జీవితాన్ని ప్రారంభించారు. ఆంధ్ర విశ్వ విద్యాలయం వీసి శ్రీ లంకపల్లి బుల్లయ గారు చొరవ తీసుకొని అదనంగా ఒక సీటు పెంచడం వల్ల అన్నమ్మగారు విజయ నగరం ఎం.ఆర్.కాలేజీ లో బి.ఇడి. చేరి చదివి ప్రాక్టికల్స్, థియరీలలో ప్రథమ శ్రేణిలో పాసయ్యారు అన్నమ్మగారు. 78 లో బి.ఇడి.పోస్టు సంపాదించారు. అన్నమ్మ గారు మంచి ఉపాధ్యాయనిగా పేరు ప్రఖ్యాతులు ఆర్జించారు. టీచింగ్ ఎయిడ్స్,బోధనోపకరణలు, బోధనాంశాల వల్లే తానూ చక్కగా బోధించా గలిగానని, అందువల్లే తనకు అవార్డ్లు రివార్డ్లు వచ్చాయని అన్నమ్మగారు పేర్కొన్నారు. చాడువుకునేప్పటి నుంచే ఉపాధ్యాయులంటే ఎనలేని గౌరవం. ఆమెకూడా టీచర్ కావడానికి తనకు బోధించిన ఉపాధ్యాయులే ప్రేరణ అని అన్నమ్మ అంటారు. సహనం...ఓర్పు...ప్రేమతో విద్యార్థులను మంచి మార్గంలోకి తీసుకు రావచ్చని నమ్మి సాధించి చూపిన ఆదర్శ ఉపాధ్యాయురాలు అన్నమ్మ.

    సంచాయక బ్యాంకు:
    విరామ సమయంలో పిల్లలకు బ్యాగులు తయారీ, అల్లికలు నేర్పించి అలా తయారు చేసినవి ఉపాధ్యయులకే అమ్మించి డబ్బును సంపాదించడం, పొడుపు చెయ్యడం అన్నమ్మ గారు విద్యార్థులకు నేర్పారు.ఈ విధంగా సంపాదించి 2 సంవత్సరాల వ్యవధిలోనే కూడబెట్టిన సొమ్ము 65 ,000 వేల రూపాయలు.

    • Dr.TALATHOTI PRITHVI RAJ
    • INDIAN HAIKU CLUB
    • ACHARYA ATHREYA
    • SAAHITHEE
    • PRITHVI POETRY
    • ANAKAPALLI YOUNG POETS
    • Dr.TALATHOTI PRITHVI RAJ
    • NAANEELU POETRY
    • Dr.TALATHOTI PRITHVI RAJ
    • Dr.TALATHOTI PRITHVI RAJ
    • Dr.TALATHOTI PRITHVI RAJ
    • SAHITHYA SAMEEKSHA
    • TELUGU POETS & WRITERS
    • Your Text
    • Your Text
    • Your Text
    • Your Text
    • Your Text
    Dr.TALATHOTI PRITHVI RAJ